రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా ,  కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో కనిపించబోతుంది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఆది పురుష్ నుండి మూవీ యూనిట్ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు టీజర్ ని విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఆది పురుష్ మూవీ టీజర్ కాస్త ప్రేక్షకులను నిరుత్సాహకుపరిచింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ టీజర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ టీజర్ 3D వర్షన్ ని కొన్ని కొన్ని పెద్ద పట్టణాల్లో ఫ్యాన్స్ కు పబ్లిక్ కి ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ లో ఈ టీజర్ ప్రదర్శనకు ప్రభాస్ మరియు ఓం రౌత్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మిగతా పట్టణాల్లో మాత్రం వీరు హాజరు అయ్యే అవకాశాలు లేనట్లు తెలుస్తుంది. ఇలా ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఆది పురుష్ మూవీ టీజర్ విషయంలో చిత్ర బృందం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: