టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు ఆయన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా గిరిశయ్య దర్శకత్వంలో రంగ రంగ వైభవంగా అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీcకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై  సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన రంగ రంగ వైభవంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించ లేక పోయింది. 

దానితో చివరగా రంగ రంగ వైభవంగా సినిమా బాక్సా ఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది. ఇలా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయిన రంగ రంగా వైభవంగా సినిమా కొన్ని రోజుల నుండి ప్రముఖ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ప్రస్తుతం రంగ రంగ వైభవంగా సినిమా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్లు ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన కేతికా శర్మ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయిన రంగ రంగా వైభవంగా సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: