ఆదిపురుష్' టీజర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.


ఈ క్రమంలోనే సినిమా యూనిట్ 'ఆదిపురుష్' టీజర్‌పై వచ్చిన విమర్శలతో ప్రేక్షకులకు, మీడియాకు స్పష్టతతో కూడిన వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్‌లో 'ఆదిపురుష్' 3డీ టీజర్‌ను ప్రదర్శించారట.3డీలో టీజర్ చూసిన తర్వాత ఈ టీజర్ మీద అభిప్రాయం మారినట్టుగా ప్రచారం జరుగుతోంది.


ఇక ఆదిపురుష్ టీజర్ 3డీ స్క్రీనింగ్ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ బాహుబలి సినిమాలో ప్రభాస్ శివ లింగం ఎత్తితే జెండు బామ్ పెట్టి ట్రోల్ చేశారని, ఇప్పుడు ఈ సినిమాకు అంతే రాముడు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ట్రోల్ చేస్తున్నారని ఎద్దేవా కూడా చేశారు. సినిమాని సినిమాలా చూడండని దిల్ రాజు హితవు పలికారు. అసలు ఆదిపురుష్ టీజర్ ఎప్పుడు వస్తుందా అని చూశానని, కొంతమంది బాగాలేదు అన్నారు కానీ చాలా బాగా ఉందని దిల్ రాజు అన్నారు.


రామాయణంలో పాత్రలు తీసుకుని ఈరోజు సినిమా ఎలా చూపించాలో ప్రేక్షకులకు చూపిస్తున్నారని సినిమా చూశాక ఎవరూ డిజప్పాయింట్ అవరని, మొదటి రోజు నెగిటివ్ వస్తుంది, ప్రభాస్ లాంటి స్టార్ వున్నా తర్వాత సూపర్ హిట్ అవుతుందని అన్నారు. ఇక ప్రభాస్ మాట్లాడుతూ ఫస్ట్ టైమ్ 3డీలో చూసిన తర్వాత చాలా ఎక్సయిట్ అయ్యానని, చిన్న పిల్లాడిని అయిపోయానని అన్నారు. ఫ్యాన్స్ కోసం రేపు 60 థియేటర్ లలో వేస్తారని పేర్కొన్నారట.


ఈ సినిమాకు వాడిన టెక్నాలజీని ఇప్పటి వరకు ఇండియాలో ఎవ్వరూ వాడలేదని పేర్కొన్న ఫస్ట్ టైమ్ 'ఆదిపురుష్'కు వాడుతున్నామని,ఈ సినిమా బిగ్ స్క్రీన్ కోసం చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారట.. ఇక ఆదిపురుష్' సినిమాను మోషన్ క్యాప్చర్ సహాయంతో 'కట్టింగ్ ఎడ్జ్' అనే టెక్నాలజీ వాడి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ టెక్నాలజీని హాలీవుడ్ యాక్షన్ మూవీస్‌లో వాడతారట. టి-సిరీస్ సంస్థ తొలిసారి ఇండియాకు తీసుకువచ్చిందట.. మరి, చిత్ర యూనిట్ చెబుతున్నట్టు రేపు బిగ్ స్క్రీన్ మీద 'ఆదిపురుష్' ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: