మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకొని ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ని కూడా సంపాదించుకున్నాడు. ఈ మూవీ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ,  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మూవీ లో హీరోగా నటించాడు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని ,  అద్భుతమైన విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది.

మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఎస్ జె సూర్య ఈ మూవీ లో ప్రతి నాయకుదిర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్మూవీ తర్వాత యు వి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ తర్వాత రామ్ చరణ్ యు వి  క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కపోయే మూవీ లో నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ మూవీ ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ తదుపరి మూవీ కి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయో లేదో అనే వార్తలపై మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. కాకపోతే రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ మాత్రం యు వి క్రియేషన్స్ బ్యానర్ లోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: