టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమా తోనే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.ఇక  నార్త్ ఇండియన్ అమ్మాయి అయినా.. అచ్చం తెలుగమ్మాయిగా కనిపించి మెప్పించింది.ఇక ఈమె అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంది.  ఇకపోతే డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం తో దక్షిణాది ఆడియన్స్‏కు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఇక ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించారు.అయితే  ఆగస్ట్ 5న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇక  ఈ సినిమా తో మృణాల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ఈ అమ్మడు కోసం వరుస ఆఫర్లు క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న మృణాల్.. ప్రేమ, పెళ్లి, వయసు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.అంతేకాదు సాధారణంగా తన వయస్సు ఎంత ? అని ప్రజలు తనను అడుగుతారని.. తన వయసు 30 ఏళ్లు అని చెప్పగానే వెంటనే పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తారని చెప్పుకొచ్చింది.ఇక నువ్వు పెళ్లి చేసుకోవాలి.. వివాహం గురించి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? నీకు 32 ఏళ్లు వచ్చేసరికి పిల్లలు పుడతారా ? అని ప్రశ్నిస్తారని..

దీంతో వారి నుంచి దూరంగా వచ్చేనని తెలిపింది మృణాల్. అంతేకాదు అలాగే 20 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు.. 30 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపింది.ఇకపోతే  20 ఏళ్లలో ప్రాథమిక విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోరని.. ఆ వయసులో ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తే.. మనం కూడా ప్రేమిస్తామని.. కానీ 30 ఏళ్ల వయసులో ఆ వ్యక్తిని నేను ఎక్కువగా ప్రేమించాలని..ఇక అతను మనకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటామని తెలిపింది. అయితే వయసులో కలిగే ప్రేమ పట్ల పారదర్శకత ఉంటుందని.. 20 ఏళ్లలో అన్వేషించడం.. పలు అంశాల గురించి నేర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు అలాగే.. 30 ఏళ్ల నాటికి తన భాగస్వామి నుంచి ఏమి ఆశించాలి అనే విషయాలపై స్పష్టత వచ్చినట్లు తెలిపింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: