బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన ఓం రౌత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకుడు ఓం రౌత్ "తనాజి" మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాన్ని మరియు అద్భుతమైన క్రేజ్ ని సంపాదించు కున్నాడు. అలా తానాజీ మూవీ తో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దర్శకుడి గా బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్న ఓం రౌత్ తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా ,  ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ప్రభాస్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని మరియు ఒక టీజర్ ను విడుదల చేసింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ టీజర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ టీజర్ ను విడుదల చేసిన తర్వాత ఈ సినిమాపై కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. దానితో తాజాగా ఈ మూవీ దర్శకుడు ఓం రౌత్ ఈ వివాదాలపై స్పందించాడు. రావణుడి పాత్ర ఖిల్జీని పోలి ఉంది అనేది నిజం కాదు అని ,  పురాణాలను ప్రేమించే వాడను నేను అని ,  సీతను అపకరించిన రావణుడు క్రూరుడు అని ,  రావణుడి ని క్రూరంగానే చూపించాను అని ,  రావణుడి పాత్ర స్వరూపాన్ని మార్చలేదు అని ,  95 సెకండ్ల టీజర్ తో సినిమాలోని పాత్రలను అంచనా వేయలేం అని ఓం రౌత్  తాజా ఇంటర్వ్యూ లో వెల్లడించాడు. ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: