తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే సూర్య ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుత మైన క్రేజ్ ని సంపాదించు కున్నాడు.

ఇది ఇలా ఉంటే సూర్య తెలుగు లో "గజినీ" మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఆ తర్వాత సింగం సిరీస్ మూవీ లతో అద్భుతమైన మాస్ హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గుర్తింపు ను దక్కించుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే సూర్య "ఈటి" అనే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే సూర్య తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా సూర్య తనకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

తాజా ఇంటర్వ్యూ లో సూర్య మాట్లాడుతూ ...  తాను మూవీ    ల లోకి రాక ముందు దుస్తులు తయారు చేసి ,  ఎగుమతి చేసే దుకాణం లో పని చేసినట్లు సూర్య చెప్పాడు. రోజుకు 18 గంటలు పని చేసే వాడిని అని ,  నెలకు 736 జీతం ఇచ్చేవారు అని సూర్య పేర్కొన్నాడు. ఇలా సూర్య తాజా ఇంటర్వ్యూ లో తనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఇది ఇలా ఉంటే సూర్య తాజాగా నటించిన ఆకాశమే నీ హద్దురా మూవీ కి ఇటీవల 5 జాతీయ చలన చిత్ర అవార్డులు కూడా దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: