డైరెక్టర్ హరి శంకర్ డీజే, గద్దల కొండ గణేష్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వరస సినిమాలతో విజయం అందుకున్నారు. అయితే ఇక  ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నారని గతంలో ఒకసారి అధికారికంగా ప్రకటించారు డైరెక్టర్ హరి శంకర్.ఇకపోతే వేరు వేరు కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుందని సమాచారం. కాగా పవన్ కళ్యాణ్  డైరెక్టర్ హరి శంకర్  కాంబినేషన్లో కొన్నేళ్ల క్రితం తేరకెక్కించిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

అయితే ఇక  ఇప్పుడు తాజాగా  పవన్ కళ్యాణ్  డైరెక్టర్ హరి శంకర్   కాంబినేషన్ పై ఒక వార్త వినిపిస్తోంది వాటి గురించి చూద్దాం.ఇక భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ కు నచ్చకపోవడంతో ఈ సినిమా ఆగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దాంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాని చేయడానికి ఇష్టపడలేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మరి ఈ విషయంపై ఎవరు అధికారికంగా తెలియజేస్తారో చూడాలి మరి.అయితే  పవన్ కళ్యాణ్ మాత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తేరీ రీమిక్స్ సినిమా పైన ఆసక్తి ఉన్నట్లుగా సమాచారం.

ఇదిలావుంటే ఇక ఇప్పుడు తేరి చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ,హరి శంకర్ కాంబినేషన్లో రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలకు సంబంధించి హరీష్ శంకర్ ,మైత్రి మూవీ సంస్థ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇక పోతే  రీమిక్స్ సినిమాలతో పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా మంచి విజయాలను అందుకుంటు ఉన్నారు. అయితే  గతంలో కూడా వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.ఇక  అందుచేతన పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమిక్స్ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: