నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. ఇలా సినిమా లతో ఫుల్ బిజీగా కెరియర్ ని కొనసాగిస్తున్న బాలకృష్ణ కొంత కాలం క్రితం ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసింది. బాలకృష్ణ మొట్ట మొదటి సారి టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించినప్పటికీ తన వాక్చాతుర్యంతో అన్ స్టపబుల్ టాక్ షో నిట్ అద్భుతమైన విజయం సాధించేలా చేశాడు.

ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 1 అద్భుతమైన విజయం సాధించడంతో ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ అన్ స్టాపబుల్ సీజన్ 2 ని మరి కొన్ని రోజుల్లో ప్రారంభించబోతుంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను కూడా ఆహా నిర్వాహక బృందం విడుదల చేసింది. మ రికొన్ని రోజుల్లోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ టాక్ షోలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎపిసోడ్ కి గెస్ట్ గా రానున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే  అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఎన్టీఆర్ రాబోతున్నాడు అనే వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు అని , దాదాపు ఆ వార్తలు అన్ని అవాస్తవం అని ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: