నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ మూవీ దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇలా అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 మూవీ గా రూపొందుతూ ఉండడంతో , ఈ మూవీ కి ఇప్పటి వరకు మూవీ యూనిట్ టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ చిత్రకరణ ప్రస్తుతం ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మూవీ షూటింగ్ ని మరి కొన్ని రోజుల్లోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై బాలకృష్ణ అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టు కున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత బాలకృష్ణ , అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం  నవంబర్ నుండి బాలకృష్ణ  , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: