బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కు ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు.. ఈయన సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.
ప్రెజెంట్ అందరి ఆశలు నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ సినిమా మీదనే ఉన్నాయి.. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందులోను ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కింది.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ముగించుకుంది. ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా నుండి ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా అందరిని ఆకట్టుకుంది.. పలువురి వ్యతిరేకంగా ట్రోల్స్ చేసిన ఈ సినిమాపై అంచనాలు అయితే పెరిగాయి.. ఇక అయోధ్యలో భారీ లెవల్ లో ఈ టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు వరుస ప్రొమోషన్స్ చేస్తున్నారు.
ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చుతో రామాయణం ఆధారంగా తెరకెక్కించారు.. ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.. సీతగా కృతి సనన్ నటిస్తుంది.. లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.. లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా దసరా సందర్భంగా చేసిన రావణ దహన కార్యక్రమం ఈసారి తెలుగోడి చేతుల మీదగా జరగడం విశేషం.
ఎప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టే రావణదహన కార్యక్రమంలో ఈసారి ఆదిపురుష్ మేకర్స్ పాల్గొన్నారు. దసరా సందర్భంగా ఎర్రకోటపై రావణదహన కార్యక్రమం చేపడుతారు అనే విషయం తెలిసిందే.. ఇక ఈ కార్యక్రమాన్ని ఈసారి ప్రభాస్ చేతుల మీదుగా జరిగింది.. లవ్ కుష్ రామ్ లీలా కమిటీ ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలకు ప్రభాస్ హాజరయ్యి అభిమానుల మధ్య రావణ దహన కార్యక్రమాన్ని విల్లుతో బాణం వదిలి దహించేలా చేసారు.. దీంతో తెలుగోడి కీర్తి ఎర్రకోటపై దద్దరిల్లి పోయేలా చేసాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: