టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ పలు సందర్భాలలో అభిమానులపై చేయి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ప్రముఖ టాలీవుడ్ నటుడు పింగ్ పాంగ్ సూర్య బాలయ్య గురించి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారట.


సత్యదేవ్ అన్నతో నాకు మంచి బాండింగ్ ఉందని సత్యదేవ్ చాలా స్పోర్టివ్ గా ఉంటారని సూర్య అన్నారు.


సత్యదేవ్ తో కలిసి 2 సినిమాలలో నేను నటించానని సూర్య చెప్పుకొచ్చారు. సత్యదేవ్ నాలెడ్జ్, డైలాగ్ డిక్షన్ బాగుంటుందని సూర్య అన్నారు. బ్లఫ్ మాస్టర్ సినిమాలో నా సీన్లు చాలా పోయాయని సూర్య కామెంట్లు చేయడం విశేషం.. ప్రస్తుతం ఆడియన్స్ కూడా అనవసర సన్నివేశాలు ఉంటే సినిమా నచ్చడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సూర్య వెల్లడించారు. అఖండ సినిమా బీజీఎంతో థియేటర్లు దద్దరిల్లిపోయిందని సూర్య అన్నారు.


అనుకోకుండా ఒకరోజు డైరెక్టర్ నన్ను తిట్టారని సూర్య కామెంట్లు కూడా చేశారు. చంద్రశేఖర్ ఏలేటి గారు చాలా కూల్ పర్సన్ అని సూర్య తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఫేస్ చేయగలనని సూర్య అన్నారు.


బాలకృష్ణ గారితో మహారథి, ఒక్క మగాడు, సింహా, డిక్టేటర్ సినిమాలలో చేశానని సూర్య తెలిపారు. బాలకృష్ణ సార్ బంగారం అని సూర్య చెప్పుకొచ్చారట.. ఆయన మనస్సులో ఏదీ ఉంచుకోడని సూర్య అన్నారు.

ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పేస్తారని సూర్య తెలిపారు. చిన్నాపెద్దా అనే తేడాల్లేకుండా హార్ట్ ఫుల్ గా బాలయ్య మాట్లాడతారని సూర్య చెప్పుకొచ్చారు. బాలయ్య ఇతరుల పై కోప్పడటం నేను చాలాసార్లు చూశానని అయితే రీజన్ లేకుండా బాలయ్య ఎవరిపై కోప్పడరని అభిమానులలో కొందరు బాలయ్యపై అభిమానంతో ఎక్కువ చేస్తారని అంతమందికి చెప్పలేర ని ఒక్కడిని కొడితే అందరూ కంట్రోల్ అవుతారు కాబట్టి బాలయ్య అలా చేస్తార ని సూర్య తెలిపారట..

మరింత సమాచారం తెలుసుకోండి: