RAPO 20: అభిమానులకు సూపర్ న్యూస్?

RAPO 20: బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చేశాడు రామ్‌. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా షురూ అయింది.ది వారియర్ సినిమా తర్వాత టాలీవుడ్ హీరో రామ్ పోతినేని  నటిస్తున్న ప్రాజెక్టు RAPO 20.బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి చాలా ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ అనేవి వస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు షురూ అయింది. షూటింగ్ మొదలైందని సోషల్ మీడియా ద్వారా కొత్త అప్‌డేట్ ఇచ్చాడు రామ్.ఇక ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. పాపులర్ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ పాన్ ఇండియా సినిమాకు పనిచేయబోతున్నారు. కాగా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది బోయపాటి టీం. 


ఇప్పటికే బోయపాటి సినిమాలకు పనిచేసిన ఎస్ థమన్ మరోసారి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు.శ్రీలీల మరోవైపు రవితేజ హీరోగా త్రినాథ రావునక్కిన దర్శకత్వం వహిస్తున్న ధమాకాలో హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త అప్‌డేట్ రావాల్సి ఉంది.ఈ సినిమా గతంలో బోయపాటి నుంచి వచ్చిన సినిమాల లాగానే చాలా పవర్ ఫుల్ ఫైట్స్ తో ఇంకా భారీ పంచ్ డైలాగ్స్ తో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా రామ్ కెరీర్ లోనే పెద్ద యాక్షన్ సినిమాగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కి సరైన హిట్ లేదు. ఈ సినిమాతో రామ్ అంతటి భారీ విజయాన్ని దక్కించుకోవాలని రామ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: