జూనియర్ ఎన్టీఆర్ ఇంకా టాలెంటెడ్  డైరెక్టర్  కొరటాల శివ కలయికలో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ మొన్నటి వరకు కూడా చాలా ఆతృతగా ఎదురుచూశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రాజెక్టు నలువైపులా కూడా కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి.ఎందుకంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అప్పుడెప్పుడో జూలై నెలలో మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత అప్పటికే కొంత నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. అయినప్పటికీ తారక్  కొరటాల తప్పకుండా సక్సెస్ అవుతారు అని మరోవైపు నుంచి అభిమానులు నమ్మారు. కానీ ప్రాజెక్టు అనేది మరింత ఆలస్యం అవుతూ ఉండడంతో కథ అంతగా కనెక్ట్ కాకపోయి ఉండవచ్చు అని అంతేకాకుండా కథలో కూడా చాలా మార్పులు చేస్తున్నారు అనే కథనాలకు ఫ్యాన్స్ కొంత సంతృప్తి చెందారు. అసలు ఈ ప్రాజెక్టు కోసం ఫ్యాన్స్ కోరుకున్నట్లే అనిరుధ్ రవిచంద్రన్ ను రంగంలోకి దింపడం కొంత కలిసి వచ్చే మంచి అంశం.


ఇక హీరోయిన్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అనే కామెంట్లు కూడా చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు దాదాపు హీరోయిన్ ఫిక్స్ అయింది అన్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. రీసెంట్ గా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ముంబైలో థాంక్ గాడ్ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటూ ఉండగా మొత్తానికి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాపై ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు ఒక వివరణ అయితే ఇచ్చింది.ఇంకా అఫిషియల్ ప్రకటించలేదు కదా అప్పుడే ఫిక్స్ చేసేస్తారా అంటూ సోషల్ మీడియా కామెంట్స్ కూడా స్పందించింది. కానీ మొత్తానికి హీరోయిన్ గొడవ అయితే ముగిసినట్లుగా సమాచారం తెలుస్తోంది. దర్శకుడు ప్రస్తుతం మిగతా టెక్నీషియన్స్ అలాగే క్యాస్టింగ్ విషయంలో కూడా తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. ఇక స్క్రిప్ట్ కూడా దాదాపు ఫినిష్ అయినట్లు సమాచారం. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టి సినిమాను వచ్చే ఏడాది చివరలో లేదా ఆ తర్వాత ఏడాది విడుదల చేయవచ్చు అని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: