సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ షూటింగ్ ని యాక్షన్స్ సన్నివేశాలతో ప్రారంభించారు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ కొన్ని రోజుల క్రితమే విజయవంతంగా పూర్తి అయింది.

అక్టోబర్ 10 వ తేదీ నుండి ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ లో పూజా హెగ్డే కూడా పాల్గొనబోతుంది. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తేరకెక్కబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న  మూడవ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి పృథ్విరాజ్ సుకుమార్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు ,  పృథ్వీరాజ్ విలన్ పాత్ర అదిరిపోయే రేంజ్ పవర్ఫుల్ గా ఉండనున్నట్లు , అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇప్పటికే పృధ్విరాజ్ కు ఈ మూవీ కథను వినిపించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: