బుల్లితెర యాంకర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం అదే పాపులారిటీతో సినిమా అవకాశాలను కూడా ఆమె అందుకున్నారు


ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ గా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసే పోస్టులు క్షణాలు వైరల్ అవ్వడమే కాకుండా కొన్నిసార్లు కాంట్రవర్సీలకు కూడా కారణం అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజా గా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో ముచ్చటించారట.


ఇలా నేటిజన్స్ తనను అడిగే ప్రశ్నలన్నింటి కీ ఈమె ఓపికగా సమాధానం చెబుతూ వచ్చారు. అయితే ఓ నెటిజన్ మాత్రం అనసూయను వింత ప్రశ్న అడిగాడట.దీంతో అనసూయ సైతం ఎంతో ఆశ్చర్యానికి గురైంది. ఇలా చిట్ చాట్ సెషన్ లో భాగంగా ఓ నెటిజన్ అనసూయని ప్రశ్నిస్తూ... నన్ను పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడిగాను అయినా ఈ విషయంపై నువ్వు ఏమాత్రం స్పందించలేదు అంటూ ప్రశ్నించారట.. ఈ విధంగా నేటిజన్ అడిగిన ప్రశ్నకు అనసూయ సైతం ఒక్కసారిగా షాక్ అయింది.


  ఇలా నేటిజన్ పెళ్లి ప్రపోజల్ గురించి అనసూయ స్పందిస్తూ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏమి మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక ఎమోజిని షేర్ చేసారట.అదే విధంగా ఈ విషయంపై తాను ఆలోచిస్తున్నటువంటి ఒక ఫోటోని కూడా ఆమె షేర్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక అనసూయ తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదేవిధంగా మరికొన్ని సినిమా షూటింగులతో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.మరి తన తరువాత సినిమా లలో ఎలాంటి వైవిధ్యమైన పాత్రను చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: