ఎక్కడైనా కూడా ఎంత ఎక్కువ గా తనని తాను మార్కెట్ చేసుకో గలిగితే వారికి అంతగా డిమాం డ్ ఏర్పడు తుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ లో హీరోలు వారిని వారు బాగా పబ్లిసిటీ చేసుకోవలసి వస్తుంది. అప్పుడే వారికి మంచి మంచి సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనని  బా గా పబ్లిసైజ్ చేసుకుంటున్నాడని ప్రస్తుతం ఆయన చేసుకుంటున్న ప్రచారాన్ని బట్టి చెప్పవచ్చు. ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

ఇందులో మరొక హీరో నటించినా కూడా ఆయన కంటే ఎక్కువగా గుర్తింపును సంపాదించుకొని ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయా డు. ఆ విధంగా తనకు వచ్చిన ఈ పాపులారిటీనీ ఉపయోగించుకునే విధంగా తనను తాను బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు అని చెప్పాలి. బాలీవుడ్ లో ఇప్పటికే పలు ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడి స్టార్ హీరోలతో కలిసి తిరుగుతున్నాడు. అక్షయ్ కుమార్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత రామ్ చరణ్ తాను బాలీవుడ్లో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నానని వెల్లడించాడు.

ఆ విధంగా ఈ హీరో ఏ విధంగా అక్కడి ప్రేక్షకులను ఎలా మచ్చిక చేసుకుంటున్నాడు అర్థమవుతుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న ఈ హీరో తొందరలోనే ఓ బాలీవుడ్ దర్శకుడు తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే రాబోతున్నాయి. ఇక పోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ప్రశాంత్ సలార్ మరియు ఎన్టీఆర్ సినిమాలు చేయబోతున్దడంతో ఇప్పట్లో అయన తో సినిమా చేయడం కుదరదు కాబట్టి ఈలోపు శంకర్ సినిమా ను బాలీవుడ్ సినిమా ను పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: