సినీ ప్రేక్షకులకు నటి సురేఖావాణి గురించి పరిచయం అక్కర్లేదు. ఇక ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది.అయితే హీరో హీరోయిన్లకు అక్క, వదిన, అత్త, పిన్ని.. డాక్టర్, నర్స్, టీచర్ ఇలా దాదాపు అన్ని క్యారెక్టర్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.ఇక  ఈ మధ్యకాలంలో సినిమాల సంఖ్య తగ్గించిన సురేఖ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటోంది. అయితే తనతో పాటు తన కూతురు సుప్రీతను కూడా బాగా పాపులర్ చేసింది. అయితే.. సుప్రీత ఇంకా సినిమాల్లోకి రాలేదు. 

కానీ.. తల్లికన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే సంపాదించుకుంది.ఇకపోతే సాధారణంగా పెళ్ళై, పిల్లలున్న ఆడవాళ్లను సమాజంలో ఆంటీ అని పిలుస్తుంటారు.అయితే  ఒకప్పుడు మిడిల్ ఏజ్ ఉన్న ఆడాళ్ళు.. ఆంటీ అంటే ఏమి అనేవారు కాదు. కానీ.. ఇప్పుడలా పిలిపించుకునే రోజులు పోయాయి అంటున్నారు నేటితరం మహిళలు. వయసు నలభై ఏళ్ళు దాటినా ఆంటీ అంటే ఒప్పుకోవట్లేదు. ఇక తాను కూడా అదే కోవకు చెందుతానని అంటోంది సురేఖావాణి. ఇదిలావుంటే ప్రస్తుతం సురేఖావాణి వయసు నలభై పైనే ఉంటుంది. ఇక అయినాసరే ఎవరైనా ఆంటీ అని పిలిస్తే ఒప్పుకోట్లేదట.

పైగా కూతురితో పాటు సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ఇక వయసు గురించి ట్రోల్ చేశారంటే.. వెంటనే చెడుగుడు ఆడేస్తుంది.అయితే ఈ క్రమంలో మోడరన్ మదర్ గా పాపులర్ అయిన సురేఖావాణిని ఆంటీ అని పిలిస్తేనే సుప్రీత ఊరుకోదు.ఇక  అలాంటిది రీసెంట్ గా ఒకడు సుప్రీతనే ఆంటీ అని పిలుస్తూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కాగా షూటింగ్స్ ఉన్నా లేకపోయినా సురేఖావాణి, సుప్రీత ఇద్దరూ రెగ్యులర్ గా వెకేషన్స్ కి వెళ్తూ.. స్టైలిష్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అయితే ఆ విధంగానే తాజాగా సుప్రీత చీరకట్టులో ఓ వీడియో షేర్ చేసింది. ఇక దీంతో ఆ వీడియోలో సుప్రీతను చూసి ఫ్యాన్స్ అంతా ఎంతో క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తుండగా.. ఒక నెటిజెన్ “హాయ్ ఆంటీ” అని కామెంట్ పెట్టాడు.  ఆ కామెంట్ సుప్రీత, సురేఖావాణి చూశారో లేదోగానీ.. నెట్టింట ఫోటో వైరల్ అవుతోంది. ఇక మరోవైపు ఇండస్ట్రీలో నటిగా అడుగు పెట్టనున్న సుప్రీత.. ఆ కామెంట్ పై ఎలా స్పందిస్తుందో చూడాలని అంటున్నారు ఫ్యాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: