యువ హీరో అడివి శేష్ తన సినిమా కథలను తానే రాసుకుంటాడు. మొదట్లో అతన్ని ఎవరు పట్టించుకోకపోయినా ఆ తర్వాత అతని టాలెంట్ గుర్తించి అవకాశాలు ఇస్తున్నారు. ఇక అడివి శేష్ తో పవన్ తనయుడు అకిరా నందన్ కి ఎక్కడ కలిసిందో కానీ అకిరా అంటే అడివి శెష్ చాలా ఇష్టాన్ని చూపిస్తాడు. లేటెస్ట్ గా హిట్ 2 ట్రైలర్ రిలీజ్ టైం లో కూడా జనసేన గ్లాస్ కనిపించింది అని రిపోర్టర్ అడిగితే అది క్యాజువల్ గా పెట్టిందని అన్నారు. పవన్, అకిరా ఇద్దరు తనకు చాలా స్పెషల్ అని.. వాళ్లు ఇక్కడ ఉంటారని హృదయాన్ని చూపించాడు అడివి శేష్.

ఇక ఈ క్రమంలో అడివి శేష్ కథతో అకిరా సినిమా ఉంటుందని ఓ న్యూస్ వైరల్ అయ్యింది. అకిరా కోసం నిజంగానే అడివి శేష్ కథ రెడీ చేస్తున్నాడా.. ఆ మధ్య అకిరా తెరంగేట్రం అంటూ మీడియా హడావిడి చేసింది. ఇప్పుడు అకిరా కోసం ఏకంగా అడివి శేష్ స్టోరీ రెడీ అంటూం చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది అన్నది పక్కన పెడితే అడివి శేష్ కథతో కనుక అకిరా ఎంట్రీ ఇస్తే మాత్రం ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. రొటీన్ కి భిన్నంగా ప్రత్యేక కథలతో అడివి శేష్ సినిమాలు చేస్తున్నారు. అతను చేస్తున్న ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతూ వస్తుంది.

అకిరా సినిమాకు కథ అందిస్తే మాత్రం అడివి శేష్ ఓ అద్భుతమైన లైన్ అందిస్తాడని చెప్పొచ్చు. పవన్, అకిరాలు అంటే అడివి శేష్ కి ఎంతో అభిమానం. అందుకే వాళ్ల పేరు ఎత్తగానే అడివి శేష్ ఎక్సయిట్ అవుతుంటాడు. ఏది ఏమైనా అడివి శేష్ ఓ పక్క హీరోగా మరోపక్క రైటర్ గా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. అడివి శేష్ ప్రస్తుతం హిట్ 2 సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాని నిర్మాతగా శైలేష్ కొలను ఈ మూవీ డైరెక్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: