టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ , రవిబాబు దర్శకత్వం లో తనకెక్కిన అల్లరి మూవీ తో హీరోగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. మొదటి మూవీ తోనే అల్లరి నరేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఈ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను కూడా దక్కించుకున్నాడు. ఆ తర్వాత అల్లరి నరేష్ ఎక్కువగా కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే అల్లరి నరేష్ తన కెరియర్ లో కొన్ని వైవిధ్యమైన మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా అల్లరి నరేష్ "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" అనే వైవిధ్యమైన మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ డిసెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గ నటించింది. ఇప్పటివరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ థియేటర్ లలో విడుదల చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.
నైజాం : 150 ప్లస్ .
సీడెడ్ : 60 .
ఆంధ్ర : 180 ప్లస్ .
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం మూవీ 390 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది.
రెస్ట్ ఆఫ్ ఇండియా : 120 .
ప్రపంచ వ్యాప్తంగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం 510 థియేటర్ లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: