ఇప్పటికే తమిళ భాషలో విడుదలై సూపర్ సక్సెస్ ను సాధించిన లవ్ టుడే సినిమాను తెలుగు లో కూడా లవ్ టుడే పేరు తో విడుదల చేయనున్న విషయం మన అందరికీ తెలిసిందే. లవ్ టుడే మూవీ తమిళం లో నవంబర్ 4 వ తేదీన విడుదల భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను సంపాదించుకుంది. దానితో ఈ మూవీ ని తెలుగు లో నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటు వంటి దిల్ రాజు విడుదల చేయబోతున్నాడు.

మూవీ లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రదీప్ రంగనాథన్ హీరో గా నటించిన మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అజనాలు పెట్టుకున్నారు. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్ లన్ కేటాయించారు. లవ్ టుడే మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.

నైజాం ఏరియాలో లవ్ టుడే మూవీ 105 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. సీడెడ్ లో ఈ మూవీ 45 థియేటర్ లలో విడుదల కానుంది. ఆంధ్రా లో ఈ సినిమా 135 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లవ్ టు డే మూవీ 285 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. ఇలా లవ్ టుడే మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనే రేంజ్ సంఖ్య థియేటర్ లలో విడుదల కావడానికి రెడీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: