సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం మహేష్ బాబు "సర్కారు వారి పాట" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ద్వారా మహేష్ బాబు బ్లాక్ బాస్టర్ విజయాన్ని కూడా అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయ్యింది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. మొదటి షెడ్యూల్ లో భాగంగా ఈ మూవీ యూనిట్ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీకి తమన్ సంగీతం అందించబోతున్నట్లు మొదట వార్తలు బయటికి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత తమన్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ కి సంగీతం అందించడం లేదు అని కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఈ సినిమా నిర్మాత నాగ వంశీ స్పందించాడు. నాగ వంశీ తాజాగా స్పందిస్తూ ... మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని కన్ఫామ్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: