బాహుబలి పాత్ర అంత ఎలివేట్ అవడానికి కారణం ఇవతల భళ్లాలదేవుడుగా చేసిన రానా కూడా అంత బలంగా ఉండటమే. ఆ సినిమాలో హీరో ప్రభాస్ కి ఈక్వల్ గా రానాకి సూపర్ క్రేజ్ వచ్చింది. రానా కి ఆల్రెడీ బాలీవుడ్ లో ఫ్యాన్స్ ఉండగా బాహుబలి తర్వాత అది మరింత పెరిగింది. అంతేకాదు తెలుగు లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ప్రతి హీరోయిన్ కూడా రానా గురించే అడుగుతారట. ఒకసారి అల్లు అర్జున్ కూడా ఈ అనుభవం ఎదురైందట. బన్నీనే రానా నెంబర్ కోసం ఒక హీరోయిన్ అడిగిందట.
అలా అభిమానులనే కాదు హీరోయిన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాడు రానా. హీరోగా ఒక ఇమేజ్ లో ఉండిపోకుండా నటుడిగా ఎలాంటి పాత్రలనైనా చేయాలని ఒక పంథాలో కొనసాగుతున్నాడు రానా. దగ్గుబాటి వారసుడిగా వెంకటేష్ తర్వాత హీరోగా నిలదొక్కుకున్న రానా ఫ్యూచర్ లో మరెన్నో ప్రయోగాత్మక సినిమాలు చేయాలని చూస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ తో రానా భారీ ప్రాజెక్ట్ లు చేసినా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఎందుకో రానా ఆ సాహసం చేయట్లేదు.