గత కొన్ని రోజుల నుంచి తమిళ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం లేదు అనే వార్త బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు ఏమో కంటెంట్ ఉంటే ఏ చిత్రానైనా సరే ఆదరిస్తాము అని చెబుతూ వస్తున్నారు.ఇప్పటివరకు ఇతర భాష చిత్రాలు తెలుగులో విడుదలైనా.. ఒకవేళ కంటెంట్ బాగుంటే ఆ చిత్రాలకు బ్రహ్మరథం కట్టారు.. అయితే మొన్న దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పోన్నియన్ సెల్వన్ సినిమా విడుదలయ్యి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ తెలుగులో ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రాలేదు. దీంతో తమిళ్ ప్రేక్షకులు.." తెలుగు ప్రేక్షకులు కావాలని ఈ సినిమాను చూడలేదు" అంటూ నానా రభస చేశారు.


అంతేకాదు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగులో బడా హీరోల సినిమాలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇతర భాష చిత్రాలను ప్రదర్శించకూడదని తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  అయితే ఈ విషయాన్ని కూడా వ్యతిరేకిస్తూ తమిళ్ చిత్రాలను తెలుగులో విడుదల చేయకపోతే తెలుగు చిత్రాలను తమిళ్లో విడుదలకు అడ్డుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఇప్పుడున్న కొన్ని తమిళ్ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్స్ గా తెలుగు నిర్మాతలు వ్యవహరిస్తున్న విషయం తెలిసింది.  అయినా కూడా చర్చ జరుగుతూనే ఉంది.

ఈ క్రమంలోనే తెలుగు వాళ్ళు కంటెంట్ ఉంటే సినిమా చూస్తామని మరొకసారి నిరూపించారు. నవంబర్ 18 వ తేదీన డబ్బింగ్ మూవీ గా తెలుగులో విడుదలైన లవ్ టు డే సినిమా.. విడుదలై వారం రోజులు అవుతున్నా ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.  ఆ సినిమా కంటెంట్ బాగుంది కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కోలీవుడ్ డైరెక్టర్ లింగు స్వామి గుర్తించాలని పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతలు చెబుతున్నారు.  మరి ఈ విషయంపై లింగస్వామి ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: