టాలీవుడ్ హీరో రవితేజ మొదట పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లుగా నటించి ఆ తర్వాత హీరోగా ఎదిగారు. అలా ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా, డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తూ ఉన్నది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రవితేజ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.


వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ఈ చిత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుందని భావిస్తూ ఉన్నారు అభిమానులు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా కి సంబంధించి టీజర్, పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.ఈ ఏడాది రవితేజ నుంచి విడుదలైన ఖీలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు వారి డిజాస్టర్ ని మిగిల్చాయి. అయినప్పటికీ కూడా ధమాకా చిత్రం నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం బిజినెస్ రూ.30 కోట్లు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

రవితేజకు వరుసగా రెండు ఫ్లాపు లు పడినా కూడా ఇంత బిజినెస్ జరగడం అంటే అది ఆశ్చర్య దగ్గర విషయమని చెప్పవచ్చు. ధమాకా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 10 కోట్ల పలకగా.. ఇక డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు ఆడియో రైట్స్ అన్నీ కలుపుకొని రూ.20 కోట్ల వరకు వెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఇదంతా డైరెక్టర్ మీద నమ్మకంతోనే ఇంత క్రేజ్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన కార్తికేయ-2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందుచేతనే ఆ బ్యానర్ మీదే రవితేజ సినిమాని కూడా బాలీవుడ్ లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందుచేతనే ఇంత పెద్ద బిజినెస్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: