అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. ఇప్పటివరకు నాలుగు సినిమాలలో నటించి.. చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా ఏజెంట్ సినిమాతో స్టార్ హీరోల జాబితాలో చేరిపోవాలని పలు ప్రయత్నాలు చేయడంతోపాటు పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో అఖిల్ స్పై యాక్షన్ త్రిల్లర్ ఏజెంట్గా కనిపించబోతున్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం.

తెలుగులోపాటు పాన్ ఇండియా లెవెల్ లో తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ షూటింగ్ కి అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక గత సంవత్సరం డిసెంబర్ 24న విడుదల చేయాలని ఈ చిత్రాన్ని ప్లాన్ చేసిన కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీ మార్చవలసి వచ్చింది. ఆ తర్వాత ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయాలనుకున్నారు కానీ అది కూడా కుదరలేదని తెలుస్తోంది.


సినిమా నాగార్జున చూసి కొన్ని సన్నివేశాలు నచ్చకపోవడంతో రీషు చేయమని చెప్పడం వల్ల రీ షూటింగ్ కారణం వల్ల ఈ సినిమా డేట్ మరొకసారి మార్చాల్సి వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించి ఒక పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఆ తర్వాత చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో తమిళ సినిమా వారిసు సినిమాలు విడుదల కాబోతున్నాయి దీంతో ఏజెంట్ సినిమా రిలీజ్ పాటలు రావడం కష్టమేనని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మరి చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: