సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రారంభం అయింది. అలాగే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ మొదటి షెడ్యూల్ లో ఈ మూవీ యూనిట్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది. ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... మాటల మాతృకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాసుకున్న కథలో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు , అందులో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను చిత్ర బృందం ఇప్పటికే తీసుకోక , రెండవ హీరోయిన్మూవీ యూనిట్ శ్రీ లీల ను ఎంపిక చేసుకున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే శ్రీ లీల ఇప్పటికే రవితేజ హీరోగా తెరకెక్కిన ధమాకా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినెని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తేరకేకుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరస మూవీ లలో హీరోయిన్ గా నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మకు సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో అవకాశం దక్కినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే శ్రీ లీల  క్రేజీ మూవీ ఆఫర్ ను కొట్టేసినట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: