దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి , జూనియర్ ఎన్టీఆర్ హీరో గా తేరకెక్కిన యమదొంగ మూవీ తో సినిమా దర్శకుడుగా కెరీర్ ను మొదలు పెట్టి , ఇప్పటి వరకు ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి , దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తోను బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

ఇది ఇలా ఉంటే రాజమౌళి తన కెరియర్ లో దర్శకత్వం వహించిన బాహుబలి మరియు ఆర్ ఆర్ ఆర్ మూవీ లతో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ రెండు మూవీ లు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేక్షకులను మరియు విమర్శకులను సైతం మెప్పించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా రాజమౌళి హాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడం గురించి స్పందిస్తూ ... తప్పకుండా నేను హాలీవుడ్ సినిమా చేస్తాను అని చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో బిగ్ స్టార్ హీరో అయినటు వంటి మహేష్ బాబు తో నా తర్వాతి మూవీ ఉంటుంది.

ఇప్పటికే దానికి సైన్ చేశాను. కానీ తప్పకుండా నేను హాలీవుడ్ మూవీ ని చేస్తాను. వాళ్లు సినిమా తీసే విధానం , మెథడ్స్ గురించి తెలుసుకుంటా అని రాజమౌళి తాజాగా వివరించాడు. ఇది ఇలా ఉంటే రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ పై ఇప్పటి నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: