బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ఇనయా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక  ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ -6 లో బాగానే రాణిస్తున్నది.ఇనయా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు చాలామందికి ఈమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఈమె ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేదని అందరూ అనుకున్నారు.  ప్రస్తుతం మాత్రం టైటిల్ రేసులో బాగా దూసుకుపోతోంది ఇనయా.

అయితే ముఖ్యంగా ప్రతి వారము కూడా కంటెస్టెంట్ లు అందరూ కూడ ఈమెనే టార్గెట్ చేస్తూ ఉండడంతో ఈమెకు బాగా సింపతి పెరిగి ఓట్ల శాతం ఎక్కువగా పెరిగింది. అంతేకాదు ముఖ్యంగా ఇనయా వర్మతో కలిసి డాన్స్ చేయడంతో ఒక్కప్పుడు బాగా పాపులర్ అయింది. కాగా ఆ పాపులర్ తోనే ఈమెకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అలా బిగ్ బాస్ ఎంట్రీ తో ఒక సెలబ్రిటీగా మారిపోయింది. ఇదిలావుంటే హౌస్ లో ఉండగానే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇనయా.కాగా బిగ్ బాస్ -6 టైటిల్ని ఎలాగైనా గెలుచుకోవాలని హౌస్ లోకి వెళ్లకముందే ఎన్నో ఇంటర్వ్యూలలో తెలియజేసింది.

క్యాస్టింగ్ కౌచ్ పైన కూడా నోరు విప్పింది ఈమె.ఇక  క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదు అని చెప్పలేను కానీ ఇష్టం లేకుండా ఏ పని చేయలేము అందుకే చాలా ఆఫర్లు వచ్చిన తను వదులుకోవలసి వచ్చిందని తెలియజేసింది.ఇకపోతే  క్యాస్టింగ్ కౌచ్ అనేది అందరి విషయంలో ఒకేలా ఉండదు.అంతేకాదు  ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని తెలియజేస్తోంది ఇనయా. ఇక తను కూడా ఇలాంటివి ఎదుర్కొన్నానని చాలామంది అడిగారని ఆ పని ఇష్టం లేక సినిమాలను వదులుకున్నానని తెలియజేస్తోంది. అయితే ఆరోజు ఆ పనికి ఒప్పుకుంటే ఇప్పటికీ పెద్ద ప్రాజెక్టులు చేసేదాన్ని అని తెలియజేస్తోంది. ఒక మంచి యాక్టర్ కావాలన్నదే తన కోరిక అని ఇలాంటివి కాదని తెలియజేసినట్లు తెలుస్తోంది.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ఇనయా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: