'పుష్ప' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప అనే ఒక్క సినిమాతోనే అల్లు అర్జున్ కి దేశ, విదేశాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది.
మరి ఆ క్రేజ్ ను కాపాడుకోవాలి కదా. అందుకే.. ప్రస్తుతం అల్లు అర్జున్ ఏం చేసినా పాన్ ఇండియా ఆలోచనలతోనే చేస్తున్నాడు. అలాగే బన్నీ వరుసగా పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. అనంతరం బన్నీ పక్కన చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. పైగా బన్నీ ఇద్దరు డైరెక్టర్లకు సినిమా చేస్తా అని మాట కూడా ఇచ్చాడు.

కానీ.. ప్రస్తతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అల్లు అర్జున్ తన నిర్ణయాలను మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి కేవలం పాన్ ఇండియా దర్శకులతోనే సినిమా చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే బన్నీ ఖాతాలో మరో సినిమా చేరబోతోంది. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఓ సినిమా గురించి బన్నీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనకరాజ్ ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా అన్నీ సూపర్ హిట్ చిత్రాలే.

అందుకే స్టార్ హీరోలు సైతం లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. కాన్సెప్ట్, కమర్షియల్ అనే తేడా లేకుండా ఏ సినిమా చేసినా సక్సెస్ అవుతున్నాడు కాబట్టే.. ఆయనకు ఆ గుర్తింపు. అందుకే.. పుష్ప 2 సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయాలనేది బన్నీ ప్లాన్. లోకేష్ కనకరాజ్ కూడా బన్నీ తో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నాడు. అందుకే, 2024 జనవరి నుంచి లోకేష్ కనకరాజ్ తో సినిమా స్టార్ట్ చేసి.. 2024 దసరాకి సినిమాని రిలీజ్ చేయాలనేది అల్లు అర్జున్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. కానీ మరో వైపు లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయాలని ప్రభాస్ కూడా ఆలోచిస్తున్నాడు. మొత్తానికి ప్రభాస్ -బన్నీ లోకేష్ కనకరాజ్ కోసం పోటీ పడుతున్నారు అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: