మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ,  కియరా అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ,  అంజలి , సునీల్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీ యూనిట్ భారీ ఖర్చుతో ప్రస్తుతం రామ్ చరణ్ మరియు కియరా అద్వానీ లపై ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఉప్పెన మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బుచ్చిబాబు తన తదుపరి మూవీ ని జూనియర్ ఎన్టీఆర్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీయాలి అని అనుకున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి.

కాకపోతే చివరగా బుచ్చిబాబు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తన తదుపరి మూవీ ని సెట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై స్పందించాడు. ఈ మూవీ ప్రకటన వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. బుచ్చిబాబు మరియు అతని టీమ్ తో కలిసి పని చేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: