సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజినీ కాంత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే రజినీ కాంత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రజనీ కాంత్ కొన్ని సంవత్సరాల క్రితం బాబా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించగా , మనిషా కొయిరాల ఈ మూవీ లో రజనీ కాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. 

భారీ అంచనాల నడుమ థియేటర్ లలో బాబా మూవీ 15 ఆగస్ట్ 2002 వ తేదీ న విడుదల అయింది. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన బాబా మూవీ అప్పట్లో ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. బాబా మూవీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ లో కొన్ని సన్నివేశాలను కూడా కలపబోతున్నారు.

అందులో భాగంగా కొత్తగా యాడ్ చేయబోయే సన్నివేశాల కోసం సూపర్ స్టార్ రజనీ కాంత్ డబ్బింగ్ ను కూడా ఇప్పటికే పూర్తి చేశాడు. మరి బాబా మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ లో రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న జైలర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: