ప్రతి వారం లాగానే ఈ వారం కూడా థియేటర్ మరియు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కొన్ని సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ వారం ధియేటర్ మరియు "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల కాబోయే మూవీ ల వివరాలను తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాలెంటెడ్ నటులలో ఒకరు అయినటు వంటి అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో హీరో గా నటించిన విషయం అందరికీ తెలిసిందే .

మూవీ డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తరకెక్కిన ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా , నానిమూవీ ని నిర్మించాడు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచు గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి విష్ణు విశాల్ తాజాగా మట్టి కుస్తీ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని మాస్ మహారాజా రవితేజ సమర్పిస్తున్నాడు. రిపీట్ డిసెంబర్ 1 వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్  కానుంది. రష్మిక మందన , అమితా బచ్చన్ ముఖ్య పాత్రలలో తెరకెక్కిన గుడ్ బై మూవీ డిసెంబర్ 2 వ తేదీన నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్  కానుంది. ఇండియన్ లాక్ డౌన్ డిసెంబర్ 2 వ తేదీ నుండి జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇలా కొన్ని సినిమాలు ధియేటర్ లలో మరియు మరి కొన్ని సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ వారం విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: