సాధారణంగా సినిమాల్లో  వచ్చే కొన్ని  స్పెషల్‌ సాంగ్స్‌కు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఒక సినిమాలో ఐటెం సాంగ్‌ ఉందంటే దానికి వచ్చే క్రేజ్ వేరు. ఇక అందుకే నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడకుండా ఐటెం సాంగ్‌లను రూపొందిస్తారు.ఇదిలావుంటే ఇక  గతంలో ఐటెం సాంగ్స్‌లో నటించడానికి ప్రత్యేకంగా భామలు ఉండేవారు. అయితే వీళ్ళకి పారితోషికాలు కూడా భారీగానే ఇస్తుంటారు. ఇకపోతే  గత పుష్కర కాలం నుండి స్పెషల్ సాంగ్స్‌లో నటించడానికి స్టార్ హీరోయిన్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే  ఇక ఒక్క పాటలో నర్తిస్తే చాలు కోటీకి పైగా 

పారితోషికాన్ని తీసుకోవచ్చు అని భావిస్తున్నారు.కాగా  నిర్మాతలు కూడా తమ సినిమాలో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్‌లో నర్తిస్తుందటే ఆ సినిమాకు రెట్టింపు క్రేజ్ వస్తుందని పారితోషికం విషయంలో వెనకాడకుండా కోట్లు ఇచ్చేస్తుంటారు.ఇకపోతే శ్రీయాశరణ్‌ నుండి మొదలైన ఈ ట్రెండ్ సమంత వరకు వచ్చేసింది.  తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా స్పెషల్ సాంగ్‌లో నర్తించడానికి సిద్దమైంది.ఇక  ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ఆమే మరోవరో కాదు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్‌ నుంచి నార్త్‌ వరకు పలు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుతుపుతుంది.

అయితే ఇక  తాజాగా ఈమె స్పెషల్ సాంగ్‌లో నటించడానికి ముస్తాబవుతున్నట్లు టాక్‌.ఇకపోతే సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  అయితే కృష్ణ గారి మరణంతో షూటింగ్‌ కాస్త లేటయ్యేలా ఉంది.ఇక  ఈ లోపు మేకర్స్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేస్తున్నారు.కాగా  ఈ క్రమంలోనే ఐటెం సాంగ్‌ కోసం రష్మికను తీసుకోనున్నట్లు తెలుస్తుంది.అయితే  త్రివిక్రమ్‌ సినిమాల్లో ఇప్పటివరకు ఐటెం పాట లేదు. మొదటి సారిగా ఈ సినిమాలో ఐటెం పాటను పెట్టనున్నారట.కాగా  థమన్‌ కూడా అల వైకుంఠపురం రేంజ్‌లో ట్యూన్స్‌ను ప్లాన్‌ చేస్తున్నాడట.అయితే  హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: