ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్న అన్ స్టాపబుల్‌ కార్యక్రమం గురించి మనకి తెలిసిందే. ఇక  టాలీవుడ్‌ ప్రముఖులు పలువురు ఈ సీజన్ లో సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇదిలావుంటే ఇక తాజా వారంకు గాను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావును బాలయ్య తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడట. అంతే కాకుండా ఇక  ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ మరియు సురేష్ బాబు లు కూడా ఈ సీజన్ లో సందడి చేస్తారని తెలుస్తోంది.ఇకపోతే అల్లు అరవింద్‌ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో మంది గెస్ట్‌ లను తీసుకు వస్తున్నాడు.

 ఇక అందులో భాగంగానే ఈ దర్శక నిర్మాతలు రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే  వీరు మాత్రమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని అమాంతం పెంచిన దర్శకుడు కే విశ్వనాథ్‌ ను కూడా ఈ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.ఇదిలావుంటే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కే విశ్వనాథ్ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన్ను డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్న అన్ స్టాపబుల్‌  షో కి తీసుకు రాబోతున్నారట. లేదంటే  ఇక స్వయంగా బాలయ్య వారి ఇంటికి వెళ్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

అయితే  మొత్తానికి ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్న అన్ స్టాపబుల్‌ లో కచ్చితంగా విశ్వనాథ్ రావడం కన్ఫర్మ్‌ అంటూ ఆహా టీమ్‌ వారు చెబుతున్నారు.ఇదిలావుంటే ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఇక ఆ వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను బాలయ్య చేయబోతున్నాడు. అంతేకాదు వచ్చే ఏడాది తన కొడుకు మోక్షజ్ఞ ను కూడా బాలయ్య సినిమా ల్లో నటింపజేయబోతున్నట్లుగా ప్రకటించాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: