మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ భాష సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత తెలుగు భాష సినిమా లలో కూడా నటించి మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా దక్కించుకుంది. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ లో గబ్బర్ సింగ్ మూవీ ద్వారా మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం శృతి హాసన్ వరుస మూవీ లోతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. అందులో భాగంగా శృతి హాసన్ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా తెరకెక్కుతున్న సలార్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 

అలాగే చిరంజీవి హీరో గా తరికెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లోను , బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి మూవీ లోను శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య , వీర సింహా రెడ్డి రెండు మూవీ లు కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కానుండడం విశేషం. ఇది ఇలా ఉంటే తాజాగా శృతి హాసన్ తన ఇన్స్టా లో ఒక ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో శృతి హాసన్ ముఖం అంతా ఉబ్బి పోయినట్లు , కళ్ళ నుంచి నీరు కారుతున్నట్లు ఉంది. దీనితో శృతి హాసన్ కు ఏమైంది అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. దానితో శృతి హాసన్ ప్రస్తుతం తాను ఫీవర్ మరియు సైనస్ తో ,  బాధపడుతున్నాను అని , బ్యాడ్ డే , బ్యాడ్ హెయిర్ తో నా సెల్ఫీ ఇలా ఉంది అని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. దానితో ప్రస్తుతం శృతి హాసన్ ఫీవర్ తో ఉండడం వల్ల ఇలా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: