తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించి , డీసెంట్ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ప్రస్తుతం మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డేమూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించనుంది.

తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కథ ప్రకారం ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పూజ హెగ్డే ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ కాక , ఈ మూవీ లో రెండవ హీరోయిన్ గా శ్రీ లీల ను మూవీ యూనిట్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

మూవీ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా జరగకపోవడంతో , ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల కావడం కష్టమే అని తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: