అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మలయాళ మూవీ ల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి , ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తన అంద చందాలతో , నటనతో ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో విజయాలను అందుకొని , ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. 

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం రౌడీ బాయ్స్ , అంటే సుందరానికి , కార్తికేయ 2 మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ లలో రౌడీ బాయ్స్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. 

అంటే సుందరానికి మూవీ లో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ పాత్రలో కాకుండా ఒక కీలకమైన పాత్రలో నటించింది. కార్తికేయ 2 మూవీ లో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 18 పేజెస్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా అనుపమ పరమేశ్వరన్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. ఇన్స్టా లో తాజాగా అనుపమ పరమేశ్వరన్ బ్లాక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: