టాలీవుడ్ స్టార్ హీరో  జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్  ఇంత గ్యాప్ తీసుకోవడం ఫ్యాన్స్‌కు ఏ మాత్రం నచ్చడం లేదు.అంతేకాదు అసలు అరవింద సమేత తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా కోసమే ఎన్టీఆర్ బాగా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు.అయితే త్రిబుల్ ఆర్ తర్వాత వెంటనే కొరటాల శివ సినిమా అన్నారు. ఆరు నెలలు దాటిపోయింది. 2022 క్యాలండర్ ఈయర్ కూడా అయిపోతోంది. అయినా కూడా  ఇంకా కొరటాల శివ సినిమా పట్టాలు ఎక్కలేదు. ఇక దీనికి ప్రధాన కారణం ఆచార్య డిజాస్టర్‌తో కొరటాల బాగా డిజప్పాయింట్‌మ్మెంట్ మూడ్‌లోకి వెళ్లిపోవడమే..

అయితే ఎలాగైనా ఎన్టీఆర్ సినిమాతో హిట్ కొట్టి తనపై కంటిన్యూగా వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇక అందుకే కథలో పలు మార్పులు చేర్పులు చేయడంతో సినిమా ఇంకా పట్టాలు ఎక్కలేదు.  ఎన్టీఆర్ కాన్‌సంట్రేషన్ అంతా కొరటాల సినిమాతో పాటు ఆ తర్వాత చేసే ప్రశాంత్ నీల్ సినిమా మీదే ఉంది.కాగా  ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2 తర్వాత ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది రిలీజ్ కానుంది.ఇకపోతే సమ్మర్ నుంచి ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

సమ్మర్‌లోగా కొరటాల తన సినిమాను ఫినిష్ చేయాల్సి ఉంది. అయితే ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో ఓ షాకింగ్ డెసిషన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా త్రిబుల్ ఆర్ తర్వాత కొరటాల సినిమా కోసం ఏకంగా ఆరేడు నెలలు ఖాళీగానే ఉన్నాడు. ఇక నీల్ సినిమా విషయంలో మాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూగా ఆ సినిమాను వచ్చే యేడాది ఎండింగ్‌కు పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.అయితే కేజీయఫ్ సీరిస్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్‌కు పాన్ ఇండియా డైరెక్టర్‌గా మంచి క్రేజ్ వచ్చేసింది.ఇక  ఇప్పుడు సలార్ కూడా పాన్ ఇండియా సినిమానే. అయితే  అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ప్రశాంత్ నీల్ సినిమాతో తమ హీరోకు తిరుగులేని క్రేజ్ వచ్చేస్తుందన్న ఆశలతో ఉన్నారు.కాగా  ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు, ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడు అయితే రచ్చ మామూలుగా ఉండదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: