వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని శాండల్‌వుడ్ లో టాక్ అయితే నడుస్తోంది. అంతే కాదు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొన్ని రోజులుగా రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. సింహా, హరిప్రియ డిసెంబర్ లో నిశ్చితార్థం చేసుకుబోతున్నట్లు కూడా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ జంట వివాహబంధంలో కి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఈ వార్తలను ఇప్పటి వరకు వీరిలో ఎవరూ కూడా ధృవీకరించలేదు.
సోమవారం బెంగళూరు ఎయిర్‌పోర్టు లో వశిష్ట సింహ మరియు హరిప్రియ ఒక్కసారి గా మెరిశారు. తెల్లని దుస్తులతో చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. పెళ్లికి సంబంధించి షాపింగ్ కోసమే దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. వశిష్ట, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలి చూపులోనే ఇద్దరి మధ్య పరిచయం అయితే ఏర్పడింది.
కొన్ని రోజుల క్రితమే వశిష్ట తన ఇన్స్టాగ్రామ్ లో ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా పంచుకున్నారు. తన పోస్ట్ లో రాస్తూ.. 'మీరు ప్రతి విషయంలో ఉత్తమమైన భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నా. మీలో ఆనందం, ప్రేమ ఎప్పుడు కూడా ఉండాలి.. మీరు మీలా ఉన్నందుకు ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చారు. దీనికి హరిప్రియ కూడా 'థాంక్యూ పార్ట్నర్' అంటూ స్పందించింది.
హరిప్రియ కన్నడ లో నటిగా మంచిపేరు ను సంపాదించారు. ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాల తో ఫేమ్ సాధించారు. మరో వైపు సింహా ఆర్య లవ్ సినిమా తో ఆమె ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడి గా అందరిని మెప్పించారు.