తెలుగు సినీ పరిశ్రమలో  వంద శాతం రేటుతో దూసుకెళ్తున్న అతికొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఆయన తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి.

ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇంతలో అనిల్ ఆహాలో రాబోయే 'కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌' అనే కామెడీ షో లో జడ్జిగా కూడా పాల్గొనబోతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ప్రతి సినిమాకు తానే అతి పెద్ద విమర్శకుడినని.. సరిలేరు నీకెవ్వరును ఉదాహరణగా తీసుకున్నాడట.. ఆయన మాట్లాడుతూ "రైలు ఎపిసోడ్‌లో బండ్ల గణేష్‌ గారి ట్రాక్‌ని షూట్ చేయడం అయితే చాలా ఆనందించాను. కానీ థియేటర్‌లో చూస్తుంటే మాకు లెంగ్త్ ఎక్కువగా అనిపించింది. ఆ సింగిల్ ట్రాక్ మొత్తం ఎపిసోడ్‌పై బాగా ప్రభావం చూపింది. మేము దానిని ఎడిటింగ్ టేబుల్‌పై కత్తిరించాలని ప్లాన్ కూడా చేసాము, కానీ మేము చేయలేదు. చివరికి, థియేటర్ లో చూసిన తర్వాత నేను దానిని మేము గ్రహించాను. మనం చేసిన తప్పులను గుర్తించడం వాటిని తదుపరి చిత్రంలో పునరావృతం చేయకుండా ఉండటం చాలా ముఖ్యం, "అని కూడా ఆయన అన్నారు.

ఇక నందమూరి బాలకృష్ణ ప్రాజెక్ట్ గురించి అనిల్ మాట్లాడుతూ, కథ చాలా బాగా వచ్చిందని చెప్పారు. " బాలయ్య సినిమా అంటే అభిమానుల అంచనాలు కూడా నెక్స్ట్ లెవల్‌లో అయితే ఉంటాయి. బాలకృష్ణ లాంటి సూపర్ పవర్ తో చేతులు కలిపినప్పుడు ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఇదొక ప్రత్యేకమైన కాంబినేషన్. సినిమా కూడా ప్రత్యేకంగా ఉంటుంది" అన్నారు. చిన్నప్పటి నుంచి బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగినందున తన బాడీ లాంగ్వేజ్‌కు ఏది సూట్ అవుతుంది? ఏది కాదో పర్‌ఫెక్ట్‌గా ఎనలైజ్ చేయగలనని చెప్పాడట.. పైగా కథలోని బీట్స్ నచ్చితేనే బాలయ్య ఆ ప్రాజెక్ట్‌ ఓకే చేస్తాడు కాబట్టి, ఆయన్ని మెప్పించాలంటే కథను ఒళ్లు దగ్గరపెట్టుకొని సిద్ధం చేయాల్సి ఉంటుందని అన్నాడు.. తోక జాడిస్తే ఆయనకీ అర్థమైపోతుంది. అంతేకాదు కథకు ఆయన ఆమోదం తెలిపితే ఇక సగం సినిమా పూర్తయినట్లే. బాలయ్య ప్రాజెక్ట్ కోసం తాను ఎలాంటి ఒత్తిడికి గురికావడం లేదని కూడా అనిల్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: