టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అనుపమ పరమేశ్వరన్ గురించి  ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ప్రేమమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత పలు సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది.ఇక సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎన్నో గాసిప్స్.. అయితే ఇప్పుడే కాదు పాతకాలం నుంచి కూడా ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఒకప్పటి సీనియర్ హీరోలు కూడా చాలా మంది కలగలసి పోయేవారు. అయితే వాళ్లకు పెద్దగా ఈగో, ఆటిట్యూడ్ అయితే ఉండేది కాదు . కానీ  ఇక కాలం మారుతున్న కొద్దీ ఇటీవల హీరోల రూట్ కూడా మారిపోయింది.

అంతేకాదు  చాలామంది హీరోలు ఈగో, ఆటిట్యూడ్ వంటివి చూపిస్తూ ఉన్నారు. అయితే ఒక్క సినిమా హిట్ అయితే చాలు వాళ్లను వాళ్లే మెగాస్టార్ రేంజ్ లో ఊహించుకుంటూ ఉంటారు. ఇక ఇదే విధంగా కొత్త హీరోలపై సీనియర్ దర్శకుడు భరద్వాజ తమ్మారెడ్డి కూడా ఫైర్ అయిన విషయం తెలిసిందే.ఇక ఈ యంగ్ హీరోలు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకొని.. అటుపక్క దర్శక నిర్మాతలను ఇటుపక్క హీరోయిన్లను సైతం మరింత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఐటీహెబ్ఈ క్రమంలోనే అనుపమ కూడా ఆ స్టార్ హీరో చేతిలో పూర్తిస్థాయిలో ఇబ్బందులకు గురి అవుతోందట.

కాగా  ఆయన ఎవరో కాదు చాలా కాలం పాటు విజయం కోసం పాకులాడిన డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ.ఎన్నో సినిమాలలో నటించిన ఇతడికి మాత్రం మంచి గుర్తింపు రాలేదు.. కానీ డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్ లభించింది.ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కావాలని ఇష్టం ఉన్నట్టు కథలో మార్పులు చేస్తున్నాడని అంటున్నారు. ఇక కార్తికేయ 2 సినిమాతో మంచి హిట్ కొట్టి ఊపు మీదున్న అనుపమ పరమేశ్వరన్ ను ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ గా అనుకున్నారు .ఇప్పుడు అనుపమ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారని సమాచారం. అయితే నిజానికి అనుపమ కంటే ముందు చాలామంది హీరోయిన్స్ ని తీసుకున్నారు. అనుపమను ఎట్టకేలకు ఎంపిక చేసుకున్నారు.సిద్దుతో షూటింగ్ సమయంలో ఆమెకు సరిగ్గా పొసగలేదట చాలా ఇబ్బంది పడిందట ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ వెంటనే అనుపమ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: