అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా పుష్ప..ఈ సినిమాను గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు.పుష్ప' బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కనీస ప్రమోషన్ కార్యక్రమాలు చెయ్యకపోయినా గానీ అక్కడ రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పుష్ప అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.


సినిమాలో బన్నీ పలికిన డైలాగులు వేసిన స్టెప్పులు మరియు పాటలు ప్రపంచ సినిమా రంగాన్ని కుదిపేసాయి. దీంతో ఇప్పుడు “పుష్ప 2″…”పుష్ప ది రూల్” పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి.పక్కా షెడ్యూల్స్ తో… మొదటి భాగం కంటే మించి సినిమా ఉండే రీతిలో సెకండ్ పార్ట్ షూటింగ్ పగడ్బందీగా కంప్లీట్ చేయడానికి డైరెక్టర్ సుకుమార్ పక్క ప్లానింగ్ తో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగంలో 'ఊ అంటావా మావా..' ఐటెం సాంగ్ ప్రపంచ సినీ రంగాన్ని కుదిపీయడం తెలిసిందే. ఈ పాటల సమంత వేసిన స్టెప్పులు థియేటర్ లో ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.


అయితే ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా అదే మాస్ మసాలా సాంగ్ దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి సుకుమార్ ప్లాన్ చేయడం జరిగిందట. ఈ క్రమంలో ఈ సాంగులో బాలీవుడ్ బ్యూటీ దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ చేత స్టెప్పులు వేయించినట్లు సమాచారం.పుష్ప 2 ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా ఉండటంతో..జాన్వీ కపూర్‌ కూడా ఇది మంచి అవకాశం అని ఒప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో గాసిప్స్ వార్తలు ప్రచారంలో వస్తున్నాయి. మొదటి పార్ట్ కి 'ఊ అంటావా మావా..' సాంగ్ లో స్పెషల్ స్టెప్పులు వేసిన సమంతకి బీభత్సమైన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పుష్ప క్రేజ్ కూడా బేరీజు వేసుకుని జాన్వి కపూర్ …పుష్ప సెకండ్ పార్ట్ లో ఐటెం సాంగ్ కి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. మరోపక్క జాన్వి కపూర్ శ్రీ దేవి కూతురు కావడంతో పాటు బాలీవుడ్ హీరోయిన్ కావడంతో …సౌత్ మరియు నార్త్ ప్రేక్షకులను ఆకర్షించినట్లు అవుతోందని సుకుమార్ ఆలోచించాడని టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: