సినిమా ఇండస్ట్రీ అంటేనే చుంగ కార్చుకునే బ్యాచ్ ఎక్కువ ఉంటారు. హీరోయిన్ల మీద ఇంట్రస్ట్ తో పాత్ర డిమాండ్ చేయకపోయినా రొమాంటిక్ సీన్స్ ని, బోల్డ్ సీన్స్ ని, బెడ్ సీన్స్ ని సినిమాల్లో ఇన్సర్ట్ చేసే దర్శకులు ఉంటారన్న అభిప్రాయాలు ఉన్నాయి. తమ ఇంట్రస్ట్ ని హీరోయిన్ల మీద బలవంతంగా రుద్ది ఆయా రొమాంటిక్ సన్నివేశాల్లో నటింపజేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు అవకాశాల కోసం తప్పక డైరెక్టర్ చెప్పినట్టు చేస్తారు. ఇంకొంతమంది హీరోయిన్లు మాత్రం అందుకు ఏ మాత్రం ఒప్పుకోరు. పోతే పోనీ పౌడాలో సినిమా అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు. అలా ఇచ్చేసిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో భార్య ఒకరు ఉన్నారు.

ఆమె మరెవరో కాదు, వెంకటేష్ హీరోగా 1999లో వచ్చిన శీను సినిమా హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా. ఈమె బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య. అయితే ఒకరోజు ఈమె షూటింగ్ సెట్స్ లో ఉండగా.. ఒక దర్శకుడు ఆమెతో మిస్ బిహేవ్ చేశాడట. ట్వింకిల్ ఖన్నా, హీరోల మధ్య రెయిన్ సాంగ్ ని చిత్రికరిస్తున్నారట. ఈ సాంగ్ కోసం తెల్లని కుర్తా ధరించిందట ట్వింకిల్ ఖన్నా. సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు దర్శకుడు ట్వింకిల్ ఖన్నా దగ్గరకు వెళ్లి ఆమె ఒంటి మీద శాలువా కప్పాడట. “ఇప్పుడు నేను నిన్ను మందాకిని పాత్ర చేయమంటే, నువ్వేం చేస్తావ్” అని దర్శకుడు ఆమెతో అన్నాడట.  దానికి ఆమె.. “మొదట నో చెప్తాను, ఆ తర్వాత నువ్వు రాజ్ కపూర్ వి కాదు” అని అంటాను అని సమాధానమిచ్చిందట.ఆ తర్వాత మళ్ళీ ఆ దర్శకుడు ఆమెతో మాట్లాడలేదట. అయితే అదొక భయంకరమైన సంఘటన అని చెప్పుకొచ్చింది. ప్రముఖ నటి వహీదా రెహమాన్ యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించింది. మందాకిని అంటే ‘రామ్ తేరీ గంగా మైలీ’ సినిమాలో నటించిన హీరోయిన్. 1985 నాటి సినిమా. ఈ సినిమాలో మందాకిని బిడ్డకు పాలిస్తున్న పాత్రలోనూ, ట్రాన్స్ పరెంట్ చీరలో స్నానం చేస్తున్న సన్నివేశాల్లో నటించింది. అప్పట్లోనే వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. ఈ సినిమా భారతీయ చలన చిత్ర రంగంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి రాజ్ కుమార్ దర్శకత్వం వహించాడు.అయితే ఆ సినిమాలో మందాకిని చేసిన బోల్డ్ సీన్స్ లో.. ట్వింకిల్ ఖన్నాతో చేయించాలని చూసాడు సదరు దర్శకుడు. ఆ విధంగా ట్వింకిల్ ఖన్నాని.. ట్రాన్స్ పరెంట్ శారీలో చూసి.. సంతృప్తి చెందుదామని అనుకున్నాడు. గురుడు మాంచి రసికుడే. అయితే ట్వింకిల్ ఖన్నా అందుకు ఒప్పుకోలేదు. నో చెప్పేయడంతో అప్పటి నుంచి దర్శకుడు మరే సినిమాలోనూ అవకాశం ఇవ్వలేదని వెల్లడించింది. ఆ దర్శకుడు ఎవరు అని మాత్రం ఆమె చెప్పలేదు. అదన్నమాట విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: