టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే ఇక  చిరంజీవి చేతిలో రామ్ చరణ్ దెబ్బలు తిన్నాడని చెబితే నమ్మడానికి చాలామంది ఇష్టపడరు.ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.అయితే  వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా చరణ్ స్వయంగా ఈ విషయాలను చెప్పడంతో నమ్మాల్సి వస్తోంది.ఇక నాన్నగారు ఇంట్లో బయట ప్రేక్షకులకు తెలిసిన మెగాస్టార్ లా ఇంట్లో ఉండరని పేర్కొన్నారు.కాగా  ఇంట్లో ఒక్క జోక్ కూడా వేయరని ఆయన వెల్లడించారు. 

అయితే నేను ఇప్పటివరకు డాడీ ఇంట్లో డాన్స్ చేయడం చూడలేదని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎంకరేజ్ చెయ్యడానికి ఒక స్టెప్ అలా వెయ్యడం తప్ప నాన్న ఇనీటియేట్ తీసుకుని డాన్స్ చేయడం మాత్రం జరగలేదని రామ్ చరణ్ కామెంట్లు చేశారు. ఇక మమ్మీ చెప్పిందే డాడీ ఫాలో అవుతారని రామ్ చరణ్ అన్నారు. నాన్నగారు నన్ను ఒకే ఒకసారి కొట్టారని చరణ్ కామెంట్లు చేశారు.ఇకపోతే  ఎనిమిది సంవత్సరాల వయస్సులో నాన్న నన్ను కొట్టారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మా డ్రైవర్, సెక్యూరిటీ గేట్ దగ్గర కొట్టుకుంటూ మాట్లాడిన

 మాటలను నేను విని అవే మాటలను ఇంట్లో మాట్లాడానని నాన్నగారు బెల్ట్ తీసుకున్నారని నాన్న కొట్టడంతో పాటు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడవద్దని సూచించారని చరణ్ కామెంట్లు చేశారు. ఇక ఆ తర్వాత నేను ఎప్పుడూ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడలేదని చరణ్ పేర్కొన్నారు. ఎదురుచెబితే నాన్నకు అసలు నచ్చదని చరణ్ అన్నారు.అయితే  బన్నీకి కూడా దెబ్బలు పడ్డాయని ఆయన కామెంట్లు చేశారు. ఇక తాతగారు స్క్రిక్ట్ గా ఉండేవారని నాన్నకు కూడా ఆ క్వాలిటీ వచ్చిందని రామ్ చరణ్ పేర్కొన్నారు.కాగా  రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: