మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తుంది. బాబీ సింహ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. 

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా థ్రియేటికల్ హక్కులను అమ్మివేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఈ సినిమా నార్త్ అమెరికా హక్కులను అమ్మి వేసింది. వాల్తేరు వీరయ్య మూవీ నార్త్ అమెరికా హక్కులను శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. తాజాగా ఈ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ మూవీని నార్త్ అమెరికాలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: