మేజర్ సినిమా తర్వాత యంగ్ హీరో అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హిట్ -2. హిట్ -1 కి సీక్వెల్ ఇది. హిట్ -1 లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. ఇప్పుడు హిట్ -2  మూవీలో అడవి శేష్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ పొందిన చిత్రంగా థియేట్రికల్ గా కూడా మంచి బిజినెస్  సొంతం చేసుకుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్క్రీన్స్ లో విడుదల కాబోతోందని సమాచారం. ఇదిలా ఉండగా హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న ఈయన కెరియర్ మొదట్లో కాస్త తడబడ్డా  ఆ తర్వాత తనను తాను మార్చుకొని స్వయంగా తన సినిమా కథలను తానే రాసుకుంటూ వరుసగా హిట్ లను అందుకుంటున్నాడు.

 అలా తెలుగు, హిందీ, మలయాళీ భాషల్లో విడుదలయి మంచి లాభాలను కూడా తెచ్చి పెట్టింది మేజర్. నెట్ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.అది అలా ఉంటే ఆయన హీరోగా వస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హిట్ 2.  శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈరోజు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ట్రైలర్ టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాదులో జరిగి మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా రన్ టైం కేవలం రెండు గంటలు మాత్రమే.. ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ రన్ టైం తో విడుదల కాబోతున్న చిత్రం ఇదే కావడం విశేషం.  

ఇప్పటికే భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ జరగగా మొత్తం రూ.14.25 కోట్ల బిజినెస్ చేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఈరోజు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కాబోతోంది.  హిందీ వెర్షన్ ను  ఈనెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. డిసెంబర్ 30వ తేదీన హిట్ 2 సినిమా హిందీలో విడుదల కాబోతోంది.  మరి అక్కడ ఏ రేంజ్ లో విజయం అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: