టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్న అడివి శేషు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకు తెలిసిందే.. అయితే తాజాగా హిట్ టు సినిమాలో హీరోగా నటించిన మంచి రెస్పాన్స్ ను అందుకున్నాడు.. ఇకపోతే శైలేష్ కొలను దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాని నేచురల్ స్టార్ నాని సంయుక్తంగా నిర్మించారు అన్న సంగతి అందరికీ తెలిసింది.. కదా ఈ సినిమాలో అడివి శేషుకి జంటగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించడం జరిగింది.. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలోని ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా హీరో అడివి శేషు తన ప్రేమ గురించి

 కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు..నేను ఓ అమ్మాయి తో చాలా సన్నిహితంగా ఉంటాను. ఇక అది ప్రేమో లేక అట్రాక్షనో నాకు అర్థం అవడం లేదు. అయితే ఆ అమ్మయిది కూడా హైదరాబాదే..ఆమె మీద ప్రేమ ఉన్నప్పటికీ గర్ల్ ఫ్రెండా కాదా అనే విషయంలో సందిగ్ధంలో పడ్డాను... ప్రస్తుతం ఆమెతో నా రిలేషన్ ఏంటో చెప్పలేకపోతున్నాను...అటు స్నేహితురాలికి ఇటు ప్రేమికురాలికి మధ్యలో ఉంది...అయితే  ఇక ఆ అమ్మాయిని నేను ప్రేమలో పడేయకపోవడానికి ప్రధాన కారణం నేను ఆ అమ్మాయితో ఎక్కువగా టైం స్పెండ్ చేయకపోవడమే...

నేను ఇప్పటివరకు నా ఫ్యామిలీకే సమయం కేటాయించను..అంతే కాదు స్నేహితులకు కూడా ఏ ఒక్కరోజు టైం కేటాయించలేదు...నా ఫోకస్ ఎక్కువగా సినిమాల మీదే ఉంటుంది...ఇలాంటి టైం లో ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆమెకు టైం కేటాయించగలనా అనే అనుమానం నాలో ఉంది..అందుకే ప్రస్తుతం ఆ అమ్మాయితో నా రిలేషన్ ఏంటో చెప్పలేకపోతున్నాను అంటూ అడివి శేష్ తన లవ్ గురించి చెప్పకనే చెప్పాడు.. ఇదిలా ఉంటే ఇక ఈ హీరో చేతిలో ప్రస్తుతం మూడు నుండి నాలుగు సినిమాలు ఉన్నాయి.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో హిట్ టు సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: