మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి ఐశ్వర్య లక్ష్మీ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మలయాళం మరియు తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. మలయాళం లో విడుదలైన జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ సినిమా ద్వారా ఐశ్వర్య లక్ష్మి సినీ రంగం లోకి వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఐశ్వర్య లక్ష్మి "మట్టి కుస్తీ" అనే మూవీ లో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో విష్ణు విశాల్ హీరో గా నటించగా మాస్ మహారాజా రవితేజమూవీ ని నిర్మించాడు.

మూవీ నిన్న అనగా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. తమిళ్ లో ఈ మూవీ గట్టా కుస్తీ అనే పేరుతో విడుదల కాగా తెలుగు లో మట్టి కుర్తి అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం డీసెంట్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఈ మూవీ ద్వారా ఐశ్వర్య లక్ష్మి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించు కునే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి.

తాజాగా మట్టి కుస్తీ మూవీ ప్రమోషన్ లలో భాగంగా ఐశ్వర్య లక్ష్మి పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మీకు ప్రేమ వివాహం ఇష్టమా ... పెద్దలు కుదిరిచిన వివాహం ఇష్టమా అనే ప్రశ్న ఐశ్వర్య లక్ష్మి కి ఎదురైంది. ఈ ప్రశ్నకు ఐశ్వర్య లక్ష్మి అసలు పెళ్లి ఇష్టం లేదు అని టక్కున సమాధానం ఇచ్చింది. ఇలా ఐశ్వర్య లక్ష్మి తాజాగా తన పెళ్లి కి సంబంధించిన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: