తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. సూర్య తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. సూర్యమూవీ లో నటించినది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినప్పటికీ ఈ పాత్రతో సూర్య ప్రేక్షకులను అలరించాడు.  అలాగే ఈ సినిమా విజయంలో కూడా సూర్య కీలక పాత్రను పోషించాడు. ఇది ఇలా ఉంటే విక్రమ్ మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ఇది ఇలా ఉంటే తాజాగా సూర్య , రెబల్ స్టార్ ప్రభాస్ గొప్పతనం గురించి వివరించాడు. తాజాగా సూర్య , ప్రభాస్ గురించి తెలియజేస్తూ ... నేను మూవీ షూటింగ్ కోసం ఓసారి హైదరాబాద్ కు వెళ్లగా , ప్రభాస్ నన్ను డిన్నర్ కు పిలిచాడు. ప్రభాస్ తో నేను సాయంత్రం 6 గంటలకు వస్తాను అని చెప్పాను. కానీ షూటింగ్ లోనే రాత్రి 11 దాటింది. దానితో రాత్రి 11 గంటల 30 నిమిషాలకు  నేను హోటల్ లో ప్రభాస్ ను కలిశాను. ఆ సమయంలో ప్రభాస్ వాళ్ళ అమ్మ చేసిన భోజనాన్ని తెప్పించాడు. నేను వచ్చే వరకు ప్రభాస్ భోజనం చేయకుండా ఎదురు చూశాడు. అంత రుచికరమైన బిర్యాని ని నేను ఎప్పుడూ తినలేదు అంటూ ప్రభాస్ ను తాజాగా సూర్యా ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: